17-02-2026 12:05:40 AM
మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి) :ఢి ల్లీలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు వైరమున్న మెదక్ బల్దియాలో కాంగ్రెస్, బిజెపి, బీఎస్పీ సహకరించుకోవడం. అనైతిక చర్య అని మా జీ డిప్యూటీ స్పీకర్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. నిత్యం కాంగ్రెస్, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుం టూ...
మెదక్ మున్సిపల్ పోరులో ఇరు పార్టీలు సహకరించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరోసారి మెదక్ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పారు. అభివృద్ధి పేరుతో ఎన్నికలు రాగా నే ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు ఏరులై పారినా ప్రభు త్వ అధికారులు, పోలీస్ శాఖ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
ఎన్నికల్లో అభ్యర్థులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్ర శ్నించారు. అభ్యర్థులను ప్రచారం చేయనీయకుండా చేశారని, కేవలం అధికారం కోస మే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆరోపించారు. ప్రజలు గమనిస్తున్నారని , బిఆర్‌ఎస్ పై నమ్మకాన్ని ఉంచి కాంగ్రెస్ కన్నా అధిక స్థానాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే సమయంలో మెదక్ లో అవినీతి జరగకుండా చూసే బాధ్యత కౌన్సిలర్ల పై ఉందని, వారికి బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కెసిఆర్ ఆదేశాల మేరకు మెదక్ లో బిఆర్‌ఎస్ పార్టీ గట్టిగా పని చేసిందని అందుకే ప్రజలు ఆదరించి కాంగ్రెస్ కన్నా పెద్ద మెజార్టీతో సభ్యులను గెలిపించాలని పేర్కొన్నారు. ప్ర జలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెదక్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
మున్సిపల్ శాఖలో ఏ అవినీతి జరిగిన భయపడకుండా ప్రజల ముం దు ఉంచుతామని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా బిఆర్‌ఎస్ పార్టీ నాయక త్వం ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ తీర్పును శిరసా వహించి ప్రజల కోరిక మేర కు పని చేస్తామని తెలిపారు.
అనంతరం ము న్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.... కెసిఆర్ , హరీష్ రావు మెదక్ గురించి ముందే చెప్పారని, మెదక్ లో రౌడీయిజం నడుస్తుందని నివారించాలంటే బలంగా ప్రజలను ఏకం చేయాలని అన్నారని గుర్తు చేశారు. వార్డులో తిరుగుతుంటే ప్రజలే బిఆర్‌ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూస్తారని వారికి తగ్గట్టుగా అభివృద్ధి మరియు వారికున్న సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో మాజీ mlc సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి, పట్టణ పార్టీ కన్వినర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులుతో పాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ లు రాజవ్వ, లలిత, స్వరూప, గంగామణి, జుబెర్ అహ్మద్, అనీస్ ఫాతిమా, సంధ్య, రాజశేఖర్, మహమ్మద్ గౌస్, శృతి, సోహెల్ మోహిద్దీన్, దీపక్, రాణి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.