14-01-2026 12:00:00 AM
అశ్వాపురం, జనవరి 13 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం చింతిర్యాల కాలనీలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సహకారంతో మంగళవారం పశువుల వైద్య శిబిరం నిర్వహించారు. మండల పశువైద్యాధికారి డా. రూబీనా ఫర్హిన్ బేగం ఆధ్వర్యంలో ఈ శిబి రం జరిగింది. ఈ శిబిరంలో గేదెలకు గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స అం దించడంతో పాటు దూడలు, మేకలకు నట్ట ల నివారణ మందులు వేశారు. పశువుల ఆ రోగ్యం, పోషణకు సంబంధించిన సూచనలు రైతులకు అందించారు.
ఈ కార్యక్రమంలో చింతిర్యాల కాలనీ సర్పంచ్ కోర్సా అలివేలు, ఉపసర్పంచ్ వెన్న అశోక్కుమార్, వార్డు సభ్యులు రావులపల్లి వెంకట నర్స య్య, గోపాల మిత్ర సూపర్వైజర్ జక్కరయ్య, వెటర్నరీ అసిస్టెంట్ ఎ. అరుణ, ఓఎస్ రాజబాబు, గోపాల మిత్రలు అలవాల నాగరా జు, గాడిద మహేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.