calender_icon.png 7 September, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన్స్ వర్సిటీకి ఎన్‌ఐఆర్‌ఎఫ్ 70వ ర్యాంకు

05-09-2025 01:52:22 AM

ఇంజినీరింగ్ విభాగంలో 80వ ర్యాంకు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్‌ఆర్డీ) గురువారం విడుదల చేసిన 2025వ సంవత్సరం ఉన్నతస్థాయి విద్యాసంస్థల ఎన్‌ఐఆర్‌ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకులలో విజ్ఞాన్స్ యూనివర్సిటీకి జాతీయస్థాయిలో 70వ ర్యాంకు లభించిందని యూని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు.

దేశ వ్యాప్తం గా ఉన్న విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన్స్ యూ నివర్సిటీకు 70వ ర్యాంకు లభించిందన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 80వ ర్యాంకు సాధించినట్లు తెలియజేశారు. టీచింగ్ లెర్నిం గ్ రిసో ర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్, ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, పీఆర్ పర్సెప్షన్ కేటగిరీల్లో విజ్ఞాన్స్ యూని వర్సిటీ పనితీరును కేంద్రం పరిశీలించి 100 పాయింట్ల స్కోర్ ప్రామాణికంగా ఈ ర్యాంకులను కేటాయించిందన్నారు.

ఈ ర్యాంకును సాధించడానికి ముఖ్య కారణం వర్సిటీ ఫ్యాక ల్టీ, రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్నేనని పేర్కొన్నారు. ఐక్యూఏసీ టీంను విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్‌లర్, కల్నల్ ప్రొఫెసర్ నాగభూషణ్, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీరావు అభినందించారు.