calender_icon.png 7 September, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాల మీదకు తెచ్చిన కరక్కాయ

05-09-2025 01:50:52 AM

  1. దగ్గు వస్తోందని రాత్రి దవడకు పెట్టుకున్న మహిళ

నిద్రలో మింగేయడంతో ఊపిరితిత్తుల్లోకి చేరడంతో దగ్గు, ఆయాసం, జ్వరం

రెండు ముక్కలుగా తొలగించిన కామినేని వైద్యులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): దగ్గు వస్తోందని రాత్రి నిద్రపోయేటప్పుడు కరక్కాయ దడవడకు పెట్టు కోవడం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చిం ది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ లోని  కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ రవీందర్ రెడ్డి మరియు డాక్టర్ భరత్ జానపాటి తెలియజేశారు.

హైదరాబాద్ నగరానికి చెందిన 57 ఏళ్ల విజేత అనే మహిళకు దగ్గు బాగా ఎక్కువగా వస్తుందని రాత్రి కరక్కాయ దవడకు పెట్టుకుని పడుకున్నది. నిద్రలో దాన్ని మింగేయడంతో శ్వాసనాళాల్లోకి వెళ్లి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. దగ్గు, ఆయాసం, ఊపిరి ఆడకపోవడంతో బాధపడుతూ కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్‌రెడ్డి పరీక్షించి..

వెంటిలేటర్ మీద ఉంచి, ఐసీయూలో అడ్మి ట్ చేశారు. చెస్ట్ ఎక్స్-రే, హెచ్‌ఆర్ సీటీ స్కాన్ పరీక్షలు చేయగా ఎడమ శ్వాసనాళాలలో ఏదో అడ్డుపడినట్టు, దాని కారణంగా ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా మూసుకుపోయినట్టు గుర్తించారు. కన్సల్టెంట్ ఇంటర్వె న్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ భరత్ జానపాటి ఆధ్వర్యంలో ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ చికిత్స చేయాలని నిర్ణయించారు.

ఆమెకు అధిక రక్తపోటు, థైరాయిడ్, గుండె సమస్య ఉన్నాయి. గతంలో ఒకసారి యాంజియోప్లాస్టీ కూడా చేశారు. దీంతో అనస్తీషియా టీం సహకారంతో ఆపరేషన్ మొదలుపెట్టారు. బ్రాంకోస్కోపీ ద్వారా రాట్ టూత్ ఫోర్సెప్స్ అనే ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఎడమ శ్వాసనాళంలో రెండు ముక్కలుగా ఇరుక్కుపోయిన కరక్కాయను తీశారు. తర్వా త తీసిన ఎక్స్-రేలో ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా తెరుచుకున్నాయి. ఎడమ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తోందని నిర్ధారించుకున్న మరుసటి రోజు ఆమెను డిశ్చార్జ్ చేశారు.