ప్రజా పాలనపై చేతబడులా?
- తెలంగాణ ప్రజలపై ఎందుకంత అక్కసు!
- బీఆర్‌ఎస్, బీజేపీ బొమ్మా, బొరుసులాంటివి
- ఎన్ని కుట్రలు చేసినా 2034 వరకు మా ప్రభుత్వమే
- త్వరలోనే ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆసరా ఫించన్లు లెక్కగట్టి అందిస్తా
- సంగారెడ్డి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
- స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం
- హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో కరువు కాట కాలు ఏర్పాడాలని, వర్షాలు కురవొద్దని, తమ ప్రభుత్వం కూలిపోవాలని మాజీ మం త్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు పక్క రాష్ట్రాల్లో క్షుద్రపూజలు, చేతబడులు చేయిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆలయాల్లో పూజలు చేస్తే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే హరీశ్‌రావు ఈ పూజ ల గురించి ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు.
కేసీఆర్‌పై మా బావ హరీశ్‌రావు చేతబడి చేశాడంటూ తెలిసిన వారితో కేటీఆర్ చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
అంతకుముందు ఐబీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు జవహల్‌లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను మంత్రులు ఉత్తమ్, వివేక్, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ నిర్మలతో కలిసి సీఎం ఆవిష్క రించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడా రు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.05 కోట్ల మం దికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రేషన్ కార్డులను అరకొరగా, ఇష్టారాజ్యంగా ఇచ్చిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వేర్వేరు కాదని ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఓర్వలేక పోతున్నాయని మండిపడ్డారు. 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా సన్నబియ్యం పంపిణీ చేసిందా అని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ హయాంలో దొడ్డు బియ్యం 85 శాతం ఎవరూ తినలేదని, కేవలం రైస్ మిల్లులకు అక్రమంగా అమ్ముకోవడానికి, పశువులకు, బీర్ల కంపెనీలకు డబ్బులకు సరఫరా చేసుకున్నారని విమర్శించారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 3.48 కోట్ల కుటుంబాలకు 2.16 లక్షల క్వింటాళ్ల సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తూ సామాజిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పండిస్తే రూ.500 బోనస్ ప్రకటించామని చెప్పారు. 32 నెలల్లోనే వడ్లకు 90వేల కోట్ల నగదును రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశామన్నారు. తాము రైతుబంధు బంద్ చేశామని ప్రచా రం చేస్తున్నారని, గతంలో ఇచ్చిన దానికంటే రూ.2వేలు అదనంగా కలిపి రెండు విడతలుగా ఎకరాలకు రూ.12వేలు రైతులకు చెల్లించామన్నారు.
రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మాదేనన్నారు. గతంలో బీఆర్‌ఎస్ చేసిన పనులపై, ఇందిరమ్మ రాజ్యంలో చేపడుతున్న పనులపై అసెంబ్లీ వేదికగా దమ్ముంటే చర్చకు రావాలంటూ బీర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామని, రా ష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండద ని స్పష్టం చేశారు.
విధ్వంసం అయిన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ప్ర యత్నం చేస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనకి మా పాలనకు అంచనా వేయాలని, దేశంలో మొదటిసారి కులగణన చేసేంది కాంగ్రెస్ అని తెలిపారు. 2034 వరకు ప్రజ ల ఆశీర్వాదం ఉండాలని కోరారు.
పింఛన్‌దారులకు భరోసా
ఆసరా పింఛన్లను లెక్కగట్టి లబ్ధి చేకూరుస్తామని సీఎం చెప్పారు. ఇందిరమ్మ ప్రభు త్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు. గతంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తే పొలాల వద్ద పం దులను బెదిరించేందుకు కట్టేవారని, తమ ప్రభుత్వం పంపిణీ చేసిన చీరతో ఈ సభకు రావడం సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో రూ.60వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు.
అర్హులైన ఆసరా పింఛన్దారులకు అందరికీ అందిస్తామని హామీనిచ్చారు. ఆనాడు ఊరించి డబుల్ బె డ్‌రూమ్ ఇల్లు అన్నాడని.. ఆహా నా పెళ్ళం టా సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా ఊరించాడని ఎద్దేవా చేశారు. వాళ్ళ ఇండ్ల లో అందరికి ఫామ్ హౌస్‌లు వచ్చాయని, పదేకరాల్లో గడి కట్టుకున్నాడని తెలిపారు.
త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు వేస్తాం
త్వరలోనే మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని నిరుద్యోగ యువతకు సీఎం హామీ ఇచ్చారు. అన్ని శాఖ ల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ నేత లు కేవలం విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి ప్రాణాలతో రాజకీ యం చేస్తున్నారని ఆరోపించారు. ఆనా డు అగ్గిపెట్టేరావు, అఘోరా రావు వంద రూపాయల పెట్రోలు పోసుకొని రూ పాయి అగ్గిపెట్టె మర్చిపోయి వందలాది మంది విద్యార్థుల బలిదానాలకు కారణమయ్యారని తెలిపారు.
విద్యార్థుల త్యాగఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిదే రావుల స్వార్థపూరిత రాజకీయాల వల్ల తెలంగాణ అప్పుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ అప్పులకు రూ.75వేల కోట్ల వడ్డీ కడుతున్నా మని చెప్పారు. విద్యార్థులను రెచ్చగొట్టి వారి శవాల పునాదులపై అధికారంలో రావాలని కుట్రలు చేస్తున్నారని, వాళ్లు మాయ లేడి, మాయగాల్లు వాళ్ల మా యలో ప్రజలు పడొద్దన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యం పంపిణీ: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో ఇస్తున్నట్టుగా దేశంలో స న్నబియ్యం పంపిణీ ఎక్కడా ఇవ్వడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 3 కోట్ల 42 లక్షల మందికి 14,800 కోట్ల రూ పాయలతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉంటే తాము 3.42 కోట్ల మందికి 1.06 కోట్ల కార్డులు పంపిణీ చేశామన్నారు. ఇది నిరంతర ప్రక్రియని, పేదవారి సామాజిక భద్రత అని చెప్పారు.
కాలేశ్వరం, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల నుండి చుక్కనీరు తీసుకోకుండా 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామన్నారు. వరి కొనుగోళ్లలో 90 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. సుమారు కోటి 6 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పేదవా ళ్ళని ఆదుకోవాలి, మంచి విద్య, వైద్యం అందించాలనేది కాంగ్రెస్ నినాదమని మంత్రి దామోదర రాజనర్సింహ్మ అన్నారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీతో పేద కుటుంబాలను ఆరోగ్యంగా కాపాడుకుంటున్నామని, ఈ నెల 17న టిమ్స్ సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రభుత్వం ఇస్తున్న ప్రామాణిక గుర్తింపు కార్డు ఆహార భద్రత కార్డు అని అన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ ఉజ్వల్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






