8 July, 2026 | 8:38 PM

Breaking News

ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు   •   పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •  

వైభవంగా విజయదశమి వేడుకలు

04-10-2025 02:27 AM
  1. వరంగల్‌లో 70 అడుగుల రావణ ప్రతిమ దహనం
  2. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 

మహబూబాబాద్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో గురువారం సాయంత్రం  దసరా సంబురాలు అంబరాన్నంటాయి. వేడుకకు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్ బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, ట్రస్ట్ చైర్మన్ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 10 తలల 70 అడుగుల రావణ ప్రతిమను మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,బండ ప్రకాష్, జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహత్ భాయ్‌లతో కలిసి దహనం చేశారు.

అంతకుముందు కరిమబాద్ రామస్వామి గుడి నుంచి సీతారా మాంజనేయ, లక్ష్మణుడి విగ్రహాలను వ్రతంపై ప్రతిష్టించి, వేలాదిమంది భక్తులు వెంటరాగా శోభాయాత్ర రంగలీల మైదానానికి చేరుకొంది. ఈ యాత్ర కోలాటం, డప్పుచప్పులు, వాయిద్యాలు, భజనలు,  నృత్యాలనడుమ ఉత్సాహంగా సాగింది. అనంతరం షమీ పూజ, పాలపిట్ట దర్శనం నిర్వహించారు. ఈ వేడుకల్లో పేరిణి శివతాండవం, కూచిపూడి నృత్యాలు, విద్యా ర్థులు ప్రదర్శనలు రాణి రుద్రమ, జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

యువత కేరింతల కొడు తూ, సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించిన రోజునే ప్రజలు విజయదశమిని జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుందని, దసరా విశిష్టత గురించి వివరించారు.  మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి రంగశాయిపేట, కొత్తవాడ, ఎస్‌ఆర్‌ఆర్ తోట మైదానం ప్రాంతాల్లో జరిగిన సంబరాల్లోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపల్లి రవి, పోశాల పద్మ, ముష్కమల్ల అరుణ, అనిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.