04-10-2025 02:21:46 AM
రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాం తి): రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పలు జిల్లాల్లో పడతాయ ని పేర్కొంది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆది, సోమవారాల్లో సైతం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.