calender_icon.png 4 October, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడేళ్లు చాలా కీలకం!

04-10-2025 02:31:11 AM

  1. బీజేపీ అధికారంలో వచ్చేలా కృషి చేయాలి
  2. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవల్

హైదరాబాద్, అక్టోబర్ 03 (విజయక్రాంతి):  రానున్న మూడేళ్లు బీజేపీకి చాలా కీలకమని, తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ  కృషి చేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవల్ కోరారు.. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ స్టేట్ లీగల్ సెల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి రావా లంటే  అందరం కలసి కట్టుగా పని చేయాలని సూచించారు.  దేశంలో డాక్టర్లు, న్యాయ వాదులకు చాలా డిమాండ్ ఉందని   తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని బలంగా వినిపించేందుకు అందరూ కృషి చేయాలన్నారు.  ప్రభుత్వ పరంగా తీసుకునే కొన్ని నిర్ణయాలతో సమస్యలు వచ్చే అవకాశం ఉందని, వాటిని సమర్థంగా  ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బ్రిటిష్ చట్టాలు ఇప్పటికి అమలవుతున్నాయని, వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని మోదీ ఆలోచన అని ఆయన తెలిపారు.  బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోదీ  కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశారని, దేశా న్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు.

 జీఎస్టీ తగ్గింపుతో దీపావళి వెలుగులు పేదల ఇండ్లలో నింపుతున్నారని, అగ్రదేశాల అడ్డగోలు సుంకా లతో భారతదేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలని చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ వస్తువుల వినియోగించడం ద్వారా.. మన ఆదాయం ఇతర దేశా లకు వెళ్లకుండా ఉంటుందని, పెట్టుబడులు పెరుగుతాయని, ఇతరులకు ఉపాధి కలుగుతుందన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుమాట్లాడుతూ.... త్వరిగతిన న్యాయం దక్కాలని గత చట్టాలను రద్దు చేసి.. భారత న్యాయ సంహిత చట్టాలు మోదీ సర్కార్ తెచ్చిందన్నారు. హైదరాబాద్ నడి రోడ్డుపై గతంలో న్యాయవాది దంపతులను నరికి చంపారని, కేసు వేసిన వాళ్లను వెనక్కి తీసుకోకపోతే హత్య చేశారని, సీబీఐ దర్యాప్తు ప్రస్తుతం జరుగుతుందని, న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు రావాల న్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.