16-07-2025 12:07:52 AM
ఖమ్మం, జులై 15( విజయ క్రాంతి ):సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఆ హ్వానితుడుగా కామ్రేడ్ యనమదల విక్రమ్ ను తీసుకోవటం జరిగింది అని సి పి ఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి కా. నున్నా నాగేశ్వర రావు ఒక మంగళవారం ప్రకటనలో తెలియ చేశారు. జూలై 12, 13 తేదీలలో హైదరాబా ద్ లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు.
ఖమ్మం నగరం నుండి రాష్ట్ర కమిటీకి ప్రాతినిధ్యం వ హిస్తూ రాష్త్ర కమిటీ సభ్యుడిగా ఉన్న కా. యర్ర శ్రీకాంత్ మరణించటం వలన ఒక స్థా నం ఖాళీ అయిందని, ఆ స్థానంలో ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీకి ఆహ్వానితుడిగా ఉన్న పార్టీ సీనియర్ నాయకుడు కళ్యాణం వెంకటేశ్వరరావును తీసుకోవటం జరిగిందని,
ఆయిన స్థానం లో వై విక్రమ్ రాష్ట్ర కమిటీకి ఆహ్యానితుడి గా వై. విక్రమ్ ఎన్నికైనట్లు తెలిపారు.వై విక్రమ్ రాష్ట్ర కమిటీకి ఎన్నిక కావటం పట్ల పలువురు పార్టీ నాయకులు , ప్రజా సంఘాల నాయకులు ఆయనను కలిసి అభినందించారు.