13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఉద్రిక్తంగా మారిన గ్రామసభ

31-03-2026 12:00 AM
  1. ఘర్షణకు దిగిన సర్పంచ్, ఉప సర్పంచ్ వర్గాలు
  2. సూర్యాపేట జిల్లా అట్లూరులో ఘటన

కోదాడ, మార్చి 30: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు గ్రామపంచాయతీలో సోమవారం నిర్వహించిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. గ్రామ నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించినందుకు ఉపసర్పంచ్, వార్డు సభ్యులపై సర్పంచ్ వర్గం విరుచుకుపడింది. మాటల యుద్ధం కాసేపట్లోనే కర్రల యుద్ధంగా మారి గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

గ్రామ నిధులు ఎక్కడ ఖర్చయ్యా యో చెప్పాలని పట్టుబట్టిన ఉపసర్పంచ్, వార్డు సభ్యులను లక్ష్యంగా చేసుకుని సర్పం చ్ భర్త, ఆమె మామ అనుచరులతో కలిసి దాడికి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరువర్గాల కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇరు వర్గాలు ఒకే పార్టీకి చెందినవారే కావడం గమనార్హం.