13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

31-03-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మల్యాల, మార్చి 30 (విజయక్రాంతి): కొండగట్టులో ఏప్రిల్ ఒకటి నుంచి మూడు వరకు నిర్వహించనున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కొండగట్టు ఆలయ పరిసరాల్లో నిర్వహించనున్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో 64 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హెల్ప్ సెంటర్, ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు 6 ప్రదేశాల్లో ఏర్పాటు, ప్రత్యేక స్థలాల్లో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక టెంట్ ల ఏర్పాటు, మెట్ల దారి మార్గంలో లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

దీక్ష విరమణ, ప్రసాదాల కౌంటర్ ల వద్ద క్యూ లైన్ల వద్ద బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా, పార్కింగ్ సదుపాయాలు సరిపడా ఉండేలా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు తాగునీరు (చలి వేంద్రాలు), మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డిపివో మదన్ మోహన్, ఆలయ ఏవో అంజనా రెడ్డి, ఎమ్మార్వోలు, ఎంపిడివోలు, తదితరులు పాల్గొన్నారు.