వరిగడ్డి మంటలతో గ్రామం ఉలికిపాటు
04-06-2026 01:12 AM
కోటపల్లి, జూన్ 3 : మంచిర్యాల జిల్లా కో టపల్లి మండలం ఎడగట్ట గ్రామంలో వరిగడ్డి దహనం ఘటన కలకలం రేపింది. పం ట పొలంలో వరిగడ్డిని కాల్చేందుకు రైతు నిప్పు పెట్టగా, మంటలు ఒక్కసారిగా వేగం గా వ్యాపించి మొత్తం గడ్డి దగ్ధమైంది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
మంటలు మరింత విస్తరించి సమీ ప ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉంద ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే చెన్నూర్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అప్రమత్తంగా వ్యవహరించి మంటల ను అదుపులోకి తీసుకువచ్చారు.






