4 June, 2026 | 1:43 AM

పడగ విప్పిన భుజంగం!

05-06-2026 12:00 AM
  1. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్
  2. ఏకకాలంలో 16 చోట్ల ఏసీబీ సోదాలు
  3. 100 కోట్ల ఆస్తులు గుర్తింపు
  4. 27 ఎకరాల వ్యవసాయ భూమి.. కిలో బంగారు నగలు 
  5. కళ్లుచెదిరే ఆస్తుల పత్రాలు స్వాధీనం

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన మాజీ అదనపు ఎస్పీ నాయి ని భుజంగరావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, బంధువుల ఇండ్లు, బినామీల ఇళ్లతో కలిపి ఏకకాలంలో 16 చోట్ల ఆకస్మిక సోదాలు జరిపారు.

లభ్యమై న పత్రాల ప్రకారం ఈ ఆస్తు ల రిజిస్ట్రేషన్ విలువే సుమా రు రూ.5.92 కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచి కొనసాగిన ఈ తనిఖీల్లో దర్యాప్తు అధికారులు కళ్లుచెదిరే ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఏకంగా 27.29 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ పరిధిలో 5 ఖరీదైన ఓపెన్ ప్లాట్లు, రెండు ఇళ్లు, ఒక కమర్షియల్ భవనం ఉన్నట్లు తేల్చారు.

నివాసంలో జరిపిన తనిఖీల్లో కిలో బంగారు ఆభరణాలు, రూ.3.83 లక్షల నగదుతో పాటు బ్యాంకు ఖాతాల్లో ఉన్న మరో రూ.8 లక్ష ల నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. వీటితో పాటు మారుతీ స్విఫ్ట్, కియా సెల్టోస్ కార్లను ఏసీబీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. భుజంగరావు అక్రమార్జనలో బినామీల పాత్రపైనా ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. భుజంగరావును నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరచనున్నట్లు జేడీ సింధు శర్మ వివరించారు.

సోదాల సమయంలో దర్యాప్తు అధికారులకు భుజంగరావు నివాసంలో ఏకంగా 29 మద్యం సీసాలు లభించడం గమనార్హం. అనుమతికి మించి భారీగా ఇంట్లో మద్యం నిల్వ ఉంచడంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు బృందం.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించింది. భుజంగరావుపై పలు సెక్షన్ ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది.

‘సిట్’ విచారణకు పారిజాత 

బడంగ్‌పేట్: ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ప్రత్యేక విచారణ బృందం ముందు బడంగ్‌పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, ఆమె భర్త నరసిం హారెడ్డి బుధవారం హాజరయ్యారు. అధికారులకు తమ స్టేట్మెంట్ను అందజేశారు. పారిజాత నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సిట్ అధికారులు సుమారు 30 నిమిషాల పాటు తనతో పాటు తన భర్త స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసినట్లు తెలిపారు.

2022 మున్సిపల్ ఎన్నికల సమయం నుంచే తమ ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని ఆమె పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడానికే ఈ దారుణా నికి ఒడిగట్టారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఒక మహిళా నేత, మాజీ మంత్రి తమపై కక్ష్యపూరితంగా వ్యవహరించా రని పారిజాత నరసింహారెడ్డి ఆరోపించారు.