calender_icon.png 6 December, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సమస్యలు కాంగ్రెస్ సర్పంచ్ తోనే సాధ్యం

06-12-2025 07:03:25 PM

. ఎమ్మెల్యే అనుసంధానంలో సర్పంచులు

. కాంగ్రెస్ సర్పంచ్ ద్వారానే అభివృద్ధి పనులు

. కాంగ్రెస్ సర్పంచిని గెలిపించండి 

గోపాలపేట: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ సర్పంచ్ల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సువర్ణ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో ప్రచార యాత్రలో మాట్లాడారు. గోపాలపేట గ్రామానికి నిధులు రావాలన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని ప్రజలకు గుర్తు చేశారు. ఏ పరిష్కారానికైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తేనే పనులు త్వరగా అవుతాయని చెప్పారు.

ఇతర పార్టీలను గెలిపిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ముందుకు కూడా పోలేరని ఏ పనులు కూడా జరగవని అన్నారు. కాబట్టి మనం వేసే ఓటు నిర్వీర్యం కాకుండా ఓ సమస్య గెలిపించే ఓటు వేయాలని అన్నారు. గ్రామానికి ఎన్నో సమస్యలతో అద్దంలో కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ సర్పంచ్ గా మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తే ఉంగరం గుర్తుకు అనుక్షణం మీ బిడ్డల మీవెంటే ఉంటూ కాపాడుకుంటానని అన్నారు. ప్రజలకు కావలసిన సౌకర్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యేటట్లు చూస్తానన్నారు.

మాయ మాటలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టి మోసం చేస్తారని అలాంటి వారిని నమ్మకుండా. ఐదేళ్ల పాలనలో మీ నీడలో ఉంటూ మీకు సేవ చేసుకుంటానని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సువర్ణ ప్రజలకు తెలిపారు. దయచేసి ప్రజలంతా మీ ఆడబిడ్డలా చూసుకుని తనకు వచ్చిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను అర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి భర్త ఆంజనేయులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.