calender_icon.png 6 December, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

06-12-2025 07:04:15 PM

69వ జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్‌లో మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్ నగర్ అండర్-14 క్రీడాకారులు

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వారణాసిలో జరిగిన అండర్-14, 69వ జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్‌లో మహబూబ్ నగర్ జిల్లా యువ ఆర్చర్లు అద్భుత ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే వారిని తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్‌ నుండి దేశ స్థాయిలో ప్రతిభ ప్రదర్శించినందుకు మాకు గర్వకారణంగా ఉందన్నారు.

భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం తరఫున నేను కృషి చేస్తాను హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే యువ క్రీడాకారులను ఆత్మీయంగా మాట్లాడి వారి విజయాలకు శుభాకాంక్షలు తెలుపుతూ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఆర్చరీ కోచ్ జ్ఞానేశ్వర్, ఆర్చరీ క్రీడాకారులు జి. సమీక్ష, శార్వాణి, డి.సమీక్ష, ఇషా సిద్దిఖి, సాయి మనీశ్వర్, శ్రావణి, కృతిక్ శ్రీవాత్సవ, స్మృతి సన్నిబా తదితరులు పాల్గొన్నారు.