calender_icon.png 6 December, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

06-12-2025 07:00:08 PM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.. 

మహబూబాబాద్ (విజయక్రాంతి): తొలి విడత నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు-2025 సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సూచనల ప్రకారం జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే ఐదు మండలాలు మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి, మండల కేంద్రాలలో మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, సంబంధిత ఎన్నికల విభాగం మాస్టర్ ట్రైనర్స్ చే (పిఓ) ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

నెల్లికుదురు మండల కేంద్రంలో జరిగిన శిక్షణ తరగతులలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మధుకర్ బాబు కూచిపూడి హాజరై ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. గూడూరు మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో, ఎమ్మార్వో, కేసముద్రం మండల ప్రత్యేక అధికారి మధుసుదన రాజు, మహబూబాబాద్ మండల ప్రత్యేక అధికారి పురుషోత్తం, ఇనుగుర్తి మండల ప్రత్యేక అధికారిని కృష్ణవేణి, సంబంధిత అన్ని ఎన్నికల విభాగాల అధికారులతో కలిసి స్వయంగా శిక్షణ తరగతులలో పాల్గొనీ హాజరైన ఎన్నికల విభాగం సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలు పాటించవలసిన నియమ నిబంధనలపై వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమాలను అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్ పర్యవేక్షించారు. శిక్షణకు హాజరైన, గైహాజరైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.