5 June, 2026 | 6:40 PM

గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి

05-06-2026 05:35 PM

బోథ్,(విజయక్రాంతి): గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు పచ్చదనంతో నిండిపోవాలని జిల్లా పంచాయతీ అధికారి రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మొక్కలను గ్రామ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ సమక్షంలో నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ సమస్యను కాపాడడంలో మొక్కల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. రానున్న వర్షాకాలంలో ప్రతి ఒక్కరు తమ పరిసరాలలో మొక్కలు నాటాలని సూచించారు. మొదట వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

స్వచ్ఛమైన గాలి ఉంటేనే రోగాలు దరిచేరవని నీటి కాలుష్యం గాలి కాలుష్యం వల్ల ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతాయన్నారు. సమావేశంలో ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం తమ విధిగా భావించి వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. మనిషి మనుగడ ఉండాలంటే అడవుల ఆవశ్యకత ఎంతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎం పి ఓ రాజ్ కుమార్ ఈవో అంజయ్య ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు