calender_icon.png 21 January, 2026 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టు పనులను అడ్డుకున్న గ్రామస్తులు

21-01-2026 12:00:00 AM

మర్రిగూడ, జనవరి 20: శివన్నగూడెం (చర్లగూడ) ప్రాజెక్ట్ పనులను  నర్సిరెడ్డిగూడెం ముంపు బాధిత గ్రామస్తులు మంగళవారం  అడ్డుకోని,ఆందోళన నిర్వహించారు.ఏలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఊరిని ఖాళీ చేయించారని ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు ప్లాట్స్, రిజిస్ట్రేషన్ కాగితాలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమకు న్యాయం జరిగే పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ఏ షోపు, హరికృష్ణ, బోయపల్లి రేణుక, రజిత, భారతమ్మ,కుమార్, రాములు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.