calender_icon.png 21 January, 2026 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

450 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన

21-01-2026 12:00:00 AM

జగిత్యాల జిల్లాలో అందుబాటులోకి రానున్న అన్ని రకాల ఆధునిక వైద్య సేవలు

జగిత్యాల, జనవరి20(విజయక్రాంతి): మెడికల్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్, మెడిసిన్ స్టోర్, 450 పడకల ఆస్పత్రి ఏర్పాటుతో మెడికల్ హబ్ గా మారనుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రూ. 235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల ఆస్పత్రి భవనాలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి మంగళవారం భూమి పూ జ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగిత్యాలజిల్లా కేంద్రంలో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కళాశాల దగ్గర రూ. 235 కోట్లతో 450 పడకల ఆస్పత్రిని నిర్మించుకోబోతున్నామని అన్నారు. అలాగే రూ. 23.5 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్, రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ప్రారంభించుకోబోతున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ప్రజలతో పాటు చుట్టు పక్క జిల్లాలకు చెందిన ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుందని అన్నారు. రోడ్డు ప్రమా దంలో గాయపడ్డ వారికి క్రిటికల్ కేర్ ఏర్పాటుతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

క్రిటికల్ కేర్, నూతన ఆస్పత్రి జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో జిల్లా కేంద్రంలో విద్య, వైద్యానికి అత్యధిక నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో డయాలసిస్, అత్యవసర ప్రసూతి శస్త్ర చికిత్సలు, మూడు ఆపరే షన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. జగిత్యాల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానని, జగిత్యాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.  రానున్న బడ్జెట్ సమావేశాల్లో జగిత్యాల జిల్లాకు ప్రత్యేక మెడికల్ బిల్లు పెట్టేవిధంగా కృషి చేస్తానని తెలిపారు.