13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గుడిసెలు లేని పల్లెలే కాంగ్రెస్ లక్ష్యం

26-03-2026 01:31 AM

కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

కందుకూరు, మార్చి 25: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గుడిసెలు లేని పల్లెలను నిర్మించడమే తమ లక్ష్యమని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కందుకూరు మండలంలోని కొత్తూరు, గపూర్ నగర్, ముచ్చర్ల గ్రామాల్లో పర్యటించిన ఆ యన, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని, తొలి విడత ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయని ఆయన తెలిపారు.పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని లక్ష్మారెడ్డి విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని.. ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే అందుతున్నాయని గుర్తుచేశారు.కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మరియు ఇతర హామీలను కూడా దశలవారీగా అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ కమిటీల సభ్యులు, మహిళా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.