calender_icon.png 9 December, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో కదం తొక్కిన బీఆర్‌ఎస్ కూటమి

09-12-2025 12:34:30 AM

భద్రాచలంలో భారీ ర్యాలీ

భద్రాచలం, డిసెంబర్ 8, (విజయక్రాంతి):సిపిఎం, గోండ్వానా దండకారణ్య పార్టీ, ఆదివాసి జేఏసీ మద్దతిస్తున్న బిఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ, కూ టమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలం పట్టణంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అంబేద్కర్ సెంటర్లో తొలుత మానే రామకృష్ణ సతీమణి మానే లక్ష్మి తన భర్త విజయాన్ని కోరుతూ తన భర్త కు పూలదండనేశారు.

తదుపరి డాక్టర్ బి.ఆ ర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేశారు. అంబేద్కర్ సెంటర్, యు బి సెంటర్, తాత గుడి సెంటర్, రాజ వీధి, రామాలయం వీధుల గుండా ఈ ప్రదర్శన సాగింది. అడుగడుగునా మానే రామకృష్ణకు అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున మానేకు పూలదండలు వే సి అభినందించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. 

రాజకీయాలకతీతంగా మానేయకు ఓట్లు వేయాలి : రాంప్రసాద్

ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టిన మానే రామకృష్ణకు రాజకీయాలకతీతంగా ప్రజలందరూ ఓట్లు వేసి భద్రాచలం సర్పంచిగా గెలిపించుకోవాలని, బిఆర్‌ఎస్ కూటమి వార్డు మెంబర్లను కూడా గెలిపించుకోవాలని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు. మానే ప్రజల మనిషి అని, ప్రజల కో సమే నిత్యం పోరాటంలో నిలబడ్డారని గుర్తు చేశారు. అంకిత భావంతో పనిచేసే ఇటువంటి నేతలనే ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.

భద్రాచలం ప్రజలు ఆలోచన పరులు : సిపిఎం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్

భద్రాచలం ప్రజలు ఆలోచనపరులని, ఎన్నో సందర్భాల్లో సరైన తీర్పునిచ్చారని, ఈ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా చక్క ని ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే, వివాద రహితుడైన, సేవ గుణం కలిగిన మా నే రామకృష్ణ కే అత్యధిక ఓట్లను కట్టబెడతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ పేర్కొన్నారు. మానే విజయం పట్ల తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు.

ఎక్కడికెళ్లినా ప్రజలు మా నే మాట చెబుతున్నారని వెల్లడించారు. ని జాయితీపరులను గెలిపించిన చరిత్ర భద్రాచలానికి ఉందని గుర్తు చేశారు. కుట్రలు, కుతంత్రాలతో కొంతమంది నేతలకు తాత్కాలిక ఆనందాలు పొందినా, ప్రజల ఆలోచన ఎల్లప్పుడూ నీతి కలిగిన నేతల వైపే ఉంటుందని తెలిపారు. ప్రజా క్షేత్రంలో అధర్మానికి చోటు లేదన్నారు. రామకృష్ణ గెలుపును ఎవరు ఆపలేరని వెల్లడించారు.

భద్రాచలం పట్టణాన్ని సొంత బిడ్డలా చూసుకుంటా : సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ 

భద్రాచలం పట్టణ అభివృద్ధికి శక్తివంచన మేర కృషి చేస్తానని, తన సొంత బిడ్డలా పట్టణాన్ని చూసుకుంటానని బిఆర్‌ఎస్ కూటమి సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని 20 వార్డులను తీర్చిదిద్ది మోడల్ పట్టణంగా భద్రాచలాన్ని మారుస్తానన్నారు. ఎప్పటికప్పుడు గ్రామపంచాయ తీలో ప్రజాదర్బార్ నిర్వహించి సమస్యలు తెలుసుకుని తక్షణ పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు .

ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పట్టణ కన్వీనర్ అకోజ్ సునీల్ కుమార్, కోకొన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు,బి.ఆర్. ఎస్ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి ధనేశ్వరరావు, కోటగిరి ప్రబోధ్ కుమార్,ప్రేమ్ కుమార్, బచ్చు శ్రీను,సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, సీనియర్ నాయకులు ఎంబీ నర్సారెడ్డి, గోండ్వాన దండకారణ్య పార్టీ నాయకులు గుండు శరత్, వివిధ వార్డు అభ్యర్థులు, బిఆర్‌ఎస్,సిపిఎం, గోండ్వానా దండకారణ్యం పార్టీ,ఆదివాసి జేఏసి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.