26 August, 2026 | 2:28 AM

దర్యాప్తును వేగవంతం చేయాలి

26-08-2026 12:00 AM

జిల్లా ఎస్‌పీ డి.జానకి

భూత్పూర్, ఆగస్టు 25: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ డి. జానకి అన్నారు. మంగళవారం భూత్పూర్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించి స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ  ప్రజలకు పారదర్శకమైన పోలీసు సేవలు అందించడంతో ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ నాగన్న, సెకండ్ సబ్ ఇన్స్పెక్టర్ దివ్య రెడ్డితో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.