16 July, 2026 | 4:36 AM

విరాట్ ఔట్ వివాదం..

22-04-2024 01:03 AM

భారీ లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ మంచి ఊపు మీద ఉన్న సమయంలో సందేహాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న ఏడు బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్సర్లతో 18 పరుగులు చేసిన కోహ్లీ.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. స్లోవర్ ఫుల్‌టాస్‌గా వచ్చిన బంతి నడుము కంటే ఎత్తగా వచ్చిందనుకున్న విరాట్.. వెంటనే రివ్యూ కోరగా.. పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్.. కోహ్లీ ఆ షాట్ ఆడే సమయంలో క్రీజు వదిలి ముందుకు వచ్చినట్లు గుర్తించారు.

దీంతో వాస్తవ ఎత్తు కొలిచి అది లీగల్ డెలివరీగా తేల్చేశారు. దీంతో కోహ్లీ డగౌట్‌కు వెళ్లాల్సి రాగా.. అసహనానికి గురైన విరాట్ అంపైర్ వాదించడం కనిపించింది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ స్పందిస్తూ.. ‘నేనూ, విరాట్ ఆ బంతి నడుము ఎత్తు కన్నా ఎక్కువ వచ్చిందని అనుకున్నాం. అందుకే అంపైర్‌తో మాట్లాడాం. అయితే ఆటలో నిబంధనలంటూ ఉంటాయి కదా.. వాటిని ఎవరూ కాదనలేరు’ అని పేర్కొన్నాడు.