7 July, 2026 | 1:18 AM

సచ్చిదానందన్‌కు ‘విశ్వంభర’ పురస్కారం

07-07-2026 12:37 AM
  1. డాక్టర్ట్ సినారె స్మారక జాతీయ అవార్డు ప్రకటన
  2. 29న హైదరాబాద్ రవీంద్రభారతిలో పురస్కార ప్రదానం
  3. రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రంతో ఘన సత్కారం

హైదరాబాద్, జూలై ౬ (విజయక్రాంతి): ప్రముఖ మలయాళ కవి, విమర్శకుడు కె.సచ్చిదానందన్‌ను ప్రతిష్ఠాత్మక ‘విశ్వంభర’ జాతీయ సాహిత్య పురస్కారం వరించింది. సోమవారం ఈ మేరకు సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ ప్రకటించింది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి స్మారకార్థం యేటా ట్రస్ట్ లబ్దప్రతిష్ఠులైన సాహితీవేత్తలకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నది. దీనిలో భాగాంగానే ఈ ఏడాది ఆ పురస్కారం సచ్చిదానందన్‌ను వరించింది.

ఈనెల 29న సినారె జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ట్రస్ట్ సభ్యులు ఆ యనకు గౌరవ అతిథుల చేతులమీదుగా పురస్కార ప్రదానం చేయనున్నారు. అలాగే, రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేయనున్నారు. సచ్చిదానందన్ మలయాళ సాహిత్యరంగానికి విశిష్ట సేవలందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థా యిలో మలయాళ కవిత్వానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టా రు. ఆధునిక కవిత్వానికి మార్గదర్శకుడిగా నిలిచారు.