7 July, 2026 | 1:28 AM

‘సర్’ను విజయవంతం చేయాలి

07-07-2026 12:37 AM

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి 

ఉండవెల్లి, జూలై 6: సర్ ప్రోగ్రాంని విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా వద్ద గల ఏజీఆర్ ఫంక్షన్ హాల్ లో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, సర్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ మెట్టు శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ.. బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్‌ఓ లతో సమన్వయం చేసుకుంటూ ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా నింపేలా చూడాలన్నారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లాలన్నారు. అనంతరం మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ..  పారదర్శకమైన ఖచ్చితమైన ఓటరు జాబితా తయారు చేయడమే సర్ ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు, మునిసిపల్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.