హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
07-07-2026 12:35 AM
అలంపూర్, జూలై 5: అలంపూర్ పట్టణంలోని పలు హోటళ్లలో సోమవారం మున్సిపల్ కమిషనర్ రాజేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లలో పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, వంటశాలల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యమైన ఆహార పదార్థాలనే వినియోగదారులకు అందించాలని హోటల్ నిర్వాహకులకు కమిషనర్ సూచించారు. ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారం అందించడం ప్రతి హోటల్ యజమాని బాధ్యత అని కమిషనర్ రాజేష్ పేర్కొన్నారు.






