7 April, 2026 | 4:46 PM

6 గ్యారంటీలు ఎప్పుడు పూర్తి చేస్తారు

08-12-2024 12:00 AM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎప్పటిలోగా అమలు పూర్తి చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని గాంధీ చౌక్ లో బిజెపి సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పథకాలు అమలు చేయకుండా విజయోత్సవాల పేరుతో ప్రభుత్వ అధికార దుర్విని పాల్పడుతుందని నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు బిజెపి పోరాటం చేస్తుందని జిల్లా పార్టీ అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భూమయ్య, రావుల రామనాథ్, సాదమరవిన్, రాజు, అలివేలు తదితరులు పాల్గొన్నారు.