12-05-2025 11:07:50 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు తహసీల్దార్ గా వివేక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన ముజాహిద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. పాల్వంచ తహసీల్దారుగా పనిచేసిన వివేక్ బదిలీపై ఇక్కడకు వచ్చారు.ఈ సందర్భంగా ఆర్ఐ నరసింహారావు,కార్యాలయ సిబ్బంది నూతన తహసిల్దార్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.