calender_icon.png 13 May, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మసీ ఆఫీసర్లుగా ఫార్మసిస్టులు

13-05-2025 12:00:00 AM

మంచిర్యాల, మే 12 (విజయక్రాం తి): రాష్ర్టంలోని ఫార్మసిస్టులందరిని ఫార్మసీ ఆఫీసర్లుగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జీవో నంబర్ 71ని విడుదల చేసిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్‌రాజ్ సోమవారం తెలిపారు. ఈ జీవో ప్రకారం జిల్లాలో ని 25 మంది ఫార్మసిస్టులను ఫార్మాసిస్ట్ ఆఫీసర్లుగా, జిల్లా ఫార్మసీ సూపర్ వైజర్‌ను డిస్టిక్ ఫార్మసీ ఆఫీసర్‌గా, సీనియర్ ఫార్మసిస్ట్ ఆఫీసర్‌గా హోదా కల్పించిందన్నారు.

ఫార్మాసిస్టులందరూ అటెండెన్స్ రిజిస్టర్ లో ఫార్మసీ ఆఫీసర్లుగా ఐడెంటి కార్డులు చేయించుకోవాలని, సరైన సమయంలో విధు లకు హాజరవుతూ వైద్య సేవలు అం దించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృపాబాయి, డాక్టర్ సుధాకర్‌నాయక్, శంకర్, చంద్రయ్య, శ్రీనివాస్, ఫార్మసిస్ట్ ఆఫీసర్లు, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.