13 May, 2026 | 1:46 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

‘వీఎంసీ సిస్టమ్స్’ రూ.55.73 కోట్ల ఆస్తులు జప్తు

24-04-2024 12:49 AM

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా ఇతర బ్యాంకులను మోసం చేసిన వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన రూ. 55.73 కోట్ల ఆస్తులను ప్రివెన్షన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మంగళవారం ఈడీ జప్తు చేసింది. రూ.1,745.45 కోట్ల మేర బ్యాంక్‌లను మోసం చేయడంపై బెంగళూరులో ఇటీవల నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. బ్యాంకుల నుంచి సంస్థ రుణాలు తీసుకుని ఇతర మార్గాలకు మళ్లించినట్లు, పన్ను ఎగవేతతో పాటు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లుగా గుర్తించిన ఈడీ సంస్థ  ఆస్తులను జప్తు చేసింది.