30 June, 2026 | 11:02 AM

వీఓఏల సమ్మె నోటీసు

12-05-2026 07:17 PM

సిరికొండ,(విజయక్రాంతి): సిరికొండ మండలం వీఓఏలు తమ సమస్యలు, పెండింగ్‌ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సిరికొండ పోలీస్‌ స్టేషన్‌లో సమ్మె నోటీసు సమర్పించారు. వీఓఏలు మాట్లాడుతూ ప్రభుత్వమే ఉద్యోగుల కష్టాలను పట్టించుకోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

సేవల విస్తరణ, పనిభారానికి తగ్గ వేతనం, భద్రత వంటి కీలక అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతి చేస్తామని హెచ్చరించారు. సమ్మె నోటీసు స్వీకరించిన పోలీసు అధికారులు పరిస్థితిని పై స్థాయి అధికారులకు తెలియజేస్తామని తెలిపారు.