వృత్తి నైపుణ్య శిక్షణ
ఎల్లారెడ్డి, మే 21 : ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకు ల బాలుర కళాశాలలో చదువుకొని ఉద్యోగం పొందలేని వారికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారని ఎల్లారెడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ప్రిన్సిపాల్ జి నాగేశ్వరరావు తెలిపారు. 2017 నుంచి ెుల్లారెడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర గురుకుల కళాశాలల్లో చదువుకొని ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం రాని వారు ఉంటే వారికి ప్రత్యేకంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి పొందేలా చేయాలని సూచించారు.
అందుకోసం ప్రభుత్వ కోరపా తో ఉన్నతి ఫౌండేషన్ ముందు కొ న్ని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన గురుకుల పూర్వ విద్యార్థులకు రాష్ర్ట సాంఘిక సంక్షే మ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఆసక్తి కలిగిన వారు ెుల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో వెంటనే శిక్షణ కోసం దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమన్వయకర్త మరియు ప్రిన్సిపాల్ జి నాగేశ్వరరావు కోరారు.






