22-05-2025 12:00:00 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, మే 21 (విజయక్రాంతి): రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూసమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను బుధవారం ఆదేశించారు. భూభారతి చట్టా న్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కుంటాల మండలంలో నిర్వహించిన గ్రామ రెవె న్యూ సదస్సులు విజయవంతంగా ముగియడంతో బుధవారం కలెక్టర్ కుంటాల తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండలంలోని 16 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా మొత్తం 667 భూ సంబంధిత దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ వెల్లడిం చారు. మిస్సింగ్ సర్వే నంబర్లు, సాధాబైదా మా, పేరు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, మ్యూటేషన్ వంటి సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులపై అధికారులు వివరాలను కలెక్టర్కు అందజేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడు తూ, భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి, ఇరు పక్షాల సమక్షంలో పారదర్శక విచారణ జరిపి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రేపటి నుంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్లు కమల్ సింగ్, ప్రవీణ్ కుమార్, ఏజాజ్ అహ్మద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.