17 April, 2026 | 10:18 AM

వాలీబాల్ టోర్నమెంట్

12-01-2026 09:13 PM

భీమిని,(విజయక్రాంతి): గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని, క్రీడలతో క్రమశిక్షణ పెరుగుతుందని, శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందనే సదుద్దేశంతో వాలీబాల్ టోర్నమెంట్ ను సోమవారం నిర్వహించామని భీమిని గ్రామ సర్పంచ్ బండి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. భీమిని, బిట్టూర్ పల్లి గ్రామ పంచాయతీల నుంచి 12 జట్లు పోటీ చేయగా ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోనగిరి నిరంజన్ గుప్తా, భీమిని గ్రామ సర్పంచ్ బండి శ్రీకాంత్ గౌడ్, ఉప సర్పంచ్ లోహిత్ గుప్తా హాజరై పోటీలను ప్రారంభించారు. గెలుపొందిన జట్లకు (మొదటి స్థానం బిట్టుర్ పెల్లి, రెండవ స్థానం రాజారామ్) కు అందజేశారు.