13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పాఠశాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల చేయూత

31-03-2026 12:18 AM

రూ. 12.5 వేలతో స్కూల్ రీనోవేషన్

చేవెళ్ల మార్చి 30 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్ వార్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు చేయూతనిచ్చాయి. రూ. 12.5 వేలు స్కూల్ రీనోవేషన్  వాష్ రూమ్స్, బిల్డింగ్, ప్రహరీ పేంటింగ్స్ కు వెచ్చించి స్కూల్ రీనోవేషన్ చేయించారు. ‘ఎన్ సిఆర్ అట్లేయోస్‘ ప్రతినిధి సాయి క్రిష్ణ, ‘హోవినాహోల్ ఫౌండేషన్‘ ప్రతినిధి నంది, ‘అవడ్ ఇండియా‘ ప్రతినిధి తపస్యలు సంయుక్త భాగస్వాములై స్కూల్ రీనోవేషన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏంఈఓ ఎల్. పురం దాస్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రకటన విడుదల చేశారు. ఎంఈఓ మాట్లాడుతూ...

ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి స్వచ్ఛంద సంస్థలు చేయూతనందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీరి సహకారం బిల్డింగ్ కు రంగులు కాదు రేపటి విద్యార్థి తరానికి పెట్టుబడి అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి రవీందర్ రెడ్డి, చేవెళ్ల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, రావులపల్లి సర్పంచ్ రామచంద్రయ్య, కుమ్మెర ఉపసర్పంచ్ పాండు, గ్రామ పెద్దలు శివరాజ్, రవి, మల్లారెడ్డి, గోపాల్ రెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు