మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
13-05-2024 12:40 AM
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు
భద్రాద్రి కొత్తగూడెం, మే 12 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 971 నక్సల్స్ ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 2,500 మంది పోలీసులను నియమించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144సెక్షన్ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




