10 April, 2026 | 1:58 PM

బాధ్యతతో ఓటింగ్‌లో పాల్గొనాలి

01-05-2024 01:35 AM

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

యువ ఓటర్ల తప్పక ఓటు వేయాలని పిలుపు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జిల్లాలో మొదటిసారి పోలింగ్‌లో పాల్గొనే యువత బాధ్యతగా ఓటు వేయడంతో పాటు, తమ కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్ల అంశాలపై కలెక్టరేట్‌లోని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా ఓటు వచ్చిన వాళ్లు 10వేల మంది వరకు ఉన్నారన్నారు. 18నుంచి 19ఏండ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 36,723మంది ఉన్నారని వివరించారు. వీళ్లంత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనే విధంగా చూడాలన్నారు.  హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 22,17,94 లక్షల మంది ఉన్నారన్నారు. వీరిలో 11,25,310 మంది పురుష ఓటర్లు ఉండగా 10,91,587 మంది మహిళలున్నారని వివరించారు.

ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 57మంది అభ్యర్థులు నామినేషన్స్ వేయగా, వీరిలో 19మందిని తిరస్క రించామని చెప్పారు. మరో 8మంది ఉపసంహరించుకోగా మొత్తం 30మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌లో రెండు బ్యాలెట్ పేపర్లుంటాయని తెలిపారు. మొదటి బ్యాలె ట్ పేపర్‌లో 16మంది, రెండో బ్యాలెట్‌లో 14మంది అభ్యర్థులతో పాటు నోటా ఉంటుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 807 ప్రాంతాల్లో 1947పోలింగ్ కేంద్రాలున్నాయని వివరించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ పేపర్స్ ప్రింటిం గ్ అవుతున్నాయన్నారు. హోమ్ ఓటింగ్‌కు సంబంధించి జిల్లాలో 126మంది ఓటర్లున్నారని, వీరిలో వయోవృద్ధులు 86, దివ్యాం గులు మంది, అత్యవసర సర్వీసులకు సంబంధించి 8మంది ఉన్నారని తెలిపారు. వీరికి మే 3, 4తేదీల్లో ఓటింగ్ నిర్వహిస్తామని, అందరూ అందుబాటులో ఉండాల న్నారు. అసెంబ్లీ సెగ్మెంట్స్ కోసం 203 మంది సెక్టోరల్ ఆఫీసర్స్‌ను నియమించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.