28 March, 2026 | 8:25 AM

భూపాలపల్లిలో ఓట్‌ఫర్ షూర్

04-05-2024 01:31 AM

ఓటు అవగాహన కోసం 5కే రన్

జయశంకర్  భూపాలపల్లి,  మే ౩ (విజయక్రాంతి): ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా కోరారు. శుక్రవారం అంబేద్కర్ గ్రౌండ్ నుంచి జయశంకర్ విగ్రహం వరకు ‘ఓట్ ఫర్ షూర్’ నినాదంతో నిర్వహించిన 5కే రన్‌ను ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్‌చైర్లు, నీడ కోసం షామియానాలు, కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ చెప్పా రు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్వీప్‌నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి, సీపీవో శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.