చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించాలి
నాగర్ కర్నూల్, ఆగస్టు 19 (విజయక్రాంతి): జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు కే. సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్తో కలిసి ఎస్‌ఐఆ్ప సమీక్ష నిర్వహించారు. నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన చెంచు గిరిజనులందరి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయాలన్నారు.
వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు నివాస ప్రాంతాలకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సురేంద్ర మోహన్ కోరారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే నిర్ణీత దరఖాస్తుల ద్వారా సవరణలు చేసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచించారు.






