పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం తొలగింపు దుర్మార్గమైన చర్య
వెంకటాపూర్, ఆగస్టు 19 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్య అని భారాస మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజల హృదయాల్లో పెద్ది సుదర్శన్రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని, విగ్రహాన్ని తొలగించగలరేమో కానీ, లక్షలాది మంది ప్రజల మనసుల్లో నుంచి ఆయనను ఎవరూ దూరం చేయలేరని పేర్కొన్నారు.
మృతి చెందిన వ్యక్తిపై కూడా ప్రతీకార ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ కు భయపడుతోందని, అందుకే అమరుడి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయనివ్వడం లేదని ఆరోపించారు.
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తుందనే భయంతోనే తొలగింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.ఈ సమావేశంలో పాలంపేట ఉపసర్పంచ్ చింతం ప్రకాష్, గ్రామ శాఖ అధ్యక్షుడు మూల రత్నాకర్, పిట్టల శేఖర్, షేర్ మహేందర్, చంటి, భద్రయ్య, నరేడ్ల విజేందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.






