calender_icon.png 5 May, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైరా మండల యాదవ సంఘం అధ్యక్షులుగా జావ్వాజీ నాగరాజు

05-05-2025 08:33:24 AM

నియామక పత్రం అందజేసిన కూరాకుల నాగభూషణం..

యాదవుల అభివృద్దే లక్ష్యం గా పనిచేస్తా..   జవ్వాజి

వైరా, (విజయక్రాంతి): వైరా మండల పరిధిలోని  తాటిపూడి గ్రామానికి చెందిన యువ నాయకుడిగా పలువురి మన్ననలు పొందుతున్న జవ్వాజి నాగరాజు వైరా మండల యాదవ సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు . ఈ మేరకు సంబంధించిన నియామక పత్రాన్ని యాదవ సంఘం పెద్దలు మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం ఆదివారం   నియామక పత్రాన్ని  అందజేశారు. జవ్వాజి నాగరాజు  చిన్ననాటి నుండి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా, ఆయన స్వగ్రామమైన తాటిపూడిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

2019 సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీలో   యువజన విభాగంలో  క్రియాశీలకంగా వ్యవహరించి  పార్టీ వైరా మండల యువజన సంఘం అధ్యక్షునిగా  పనిచేసి యువతరంలో తనకంటూ  ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా  పనిచేస్తున్న ఆయనకు యాదవ సంఘం వైరా మండల అధ్యక్షునిగా ఆయన నియామకం కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జవాజి నాగరాజు మాట్లాడుతూ నాపై ఎంతో విశ్వాసంతో, బాధ్యత కలిగిన ఈ పదవికి నియామకం అయ్యేందుకు కృషి చేసిన  యాదవ పెద్దలు కూరాకుల నాగభూషణం,గుమ్మ రోశయ్య తో పాటు పలువురు యాదవ నాయకులకు ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనన్నారు .E