30 April, 2026 | 2:04 AM

ఎస్‌ఎస్సీ ఫలితాల్లో 97.46శాతం ఉత్తీర్ణత

30-04-2026 12:54 AM

రాష్ట్రంలో వనపర్తి జిల్లా 19వ స్థానం

వనపర్తి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక దృష్టి, విద్యా రంగంపై తీసుకున్న కృషి ఫలితంగా వనపర్తి జిల్లా ఎస్‌ఎస్సి ఫలితాల్లో మెరుగైన స్థానం సాధించిందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ పేర్కొన్నారు.

బుధవారం ఎస్‌ఎస్సి ఫలితాల విడుదల నేపథ్యంలో వనపర్తి జిల్లా 97.46% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచిన సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ఆధ్వర్యంలో అధికారులు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ ను తన చాంబర్లో కలిశారు.

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ఎస్‌ఎస్సి (SSC) ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 97.46 శాతం ఉత్తీర్ణతతో 19వ స్థానాన్ని సాధించడం గొప్ప విషయమని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 7210 విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 7027 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక దృష్టి, విద్యా రంగంపై తీసుకున్న కృషి ఫలితంగా ఈ మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పేర్కొన్నారు.

గతేడాది ఎస్‌ఎస్సి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 29వ స్థానంలో ఉన్న వనపర్తి జిల్లా ఈసారి 10 స్థానాలు మెరుగుపడడం విద్యాశాఖ కృషికి నిదర్శనమని తెలిపారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) డీస్) నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారులను, ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, సంబంధిత సిబ్బందిని శాలువాతో సత్కరించి అభినందించారు. విద్యా శాఖ సిబ్బంది సమిష్టి కృషితో జిల్లా మంచి స్థానం సాధించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈసారి ఫలితాల్లో విద్యార్థులు వెనుకబడిన విషయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.