24 March, 2026 | 2:18 AM

లోతట్టు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు

24-03-2026 12:26 AM

బొంతు శ్రీదేవి యాదవ్

కుషాయిగూడ, మార్చి 23 (విజయక్రాం తి):  కుషాయిగూడ పోచమ్మ ఆలయం నుండి పైబస్తి వరకు 300 మీటర్లు 60 లక్షల వ్యయం తో చేపట్టనున్న బాక్స్ డ్రైన్ పనులు ప్రారంభం కావడంతో సోమవారం రాత్రి చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివసాయినగర్, బజరంగ్ కాలనీ ఆయా కాలనీలను మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ సందర్శించి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్  మాట్లాడుతూ, బాక్స్ డ్రైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  వర్షపు నీరు నిల్వ ఉండకుండా లోతట్టు ప్రాం తాలలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు  పోచ య్యగౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరజారెడ్డి, అరుణ, రమాదేవి, కరీం, గోపాల్ యాదవ్, రాఘవేందర్‌గౌడ్ పాల్గొన్నారు