22 June, 2026 | 8:49 PM

హామీలు కాదు.. యూరియా కావాలి

06-09-2025 03:03 PM

మండలంలో ప్రధాన రోడ్డు పై రైతుల ధర్నా 

ఈరోజు టోకెన్లు తీసుకోండి సోమవారం యూరో ఇస్తాం అధికారుల హామీ 

కోయిలకొండ : రైతులకు కావాల్సింది హామీలు కాదని రైతులు వేసిన పంటలు బతకాలంటే యూరియా కావాలని మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) కోయిల్ కొండ మండలంలో రైతులు మండిపడుతున్నారు. శనివారం తెల్లవారుజామున నుంచి రైతులు ఏరియా కేంద్రాల దగ్గర పడిగాపులు కాసి అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామంటూ ఎదురుచూసి తీరా యూరియా ఇంకా రాలేదు అనడంతో ఒక్కసారిగా రైతులందరూ  రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

రెండు గంటల పాటు నిర్విరామంగా రోడ్డుపై నిరసన తెలుపడంతో ట్రాఫిక్ స్తంభించింది. యూరియా అంతే వరకు తమ నిరసన కొనసాగిస్తామని చెప్పడంతో అధికారులకు రైతులను ఒప్పించడంలో తెగ ఇబ్బందులకు గురయ్యారు. గత పది పదిహేను రోజుల నుంచి ప్రతిరోజు ఇదే చెబుతున్నారని వచ్చిన కొంత యూరియా వస్తే ఎవరికి సరిపోతుందని ఇలా రోజుల తరబడి తిరగాలంటే మేము పండించే పంట వచ్చే లాభం అంతా దారి ఖర్చులకే సరిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందించి యూరియాను అందుబాటులోకి ఉంచాలని రైతులు కోరారు. దీంతో సంబంధిత శాఖ అధికారులు రైతులకు టోకెన్లు ఇచ్చి సోమవారం రోజు యూరియా అందిస్తామని భరోసా ఇచ్చారు.