బిజెపిలో వార్డు మెంబర్లు చేరిక
02-03-2026 07:00 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన వార్డు మెంబర్లు రోహినే అరవింద్, కుశాబ్ రావు, సేంద్రే కాళిదాస్, కర్మన్ కార్ భగవాన్, గణేష్ సత్తార్ భాజపాలో చేరారు. సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్ములే మధుకర్, చందన్ ఖడే తిరుపతి, బోయర్ బండు తదితరులు పాల్గొన్నారు.




