2 March, 2026 | 8:51 PM

విజయ హై స్కూల్ లో ముందస్తు హోలీ

02-03-2026 07:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విజయ హై స్కూల్ లో సోమవారం ముందస్తు హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు సహజసిద్ధమైన రంగులను తయారుచేసి ఒకరిపై ఒకరు పోసుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి నిర్వాహకులు మంచిర్యాల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.