2 July, 2026 | 2:53 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

ఘన వ్యర్థ పదార్థాల నియమంను అమలు చేయాలి

13-05-2026 08:41 PM

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అదనపు సంచాలకులు డా.అమిత్ లవ్

వనపర్తి,(విజయక్రాంతి): ఘన వ్యర్థ పదార్థాల నియమము 2026ను దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అదనపు సంచాలకులు డా. అమిత్ లవ్ సూచించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఘన వ్యర్థ పదార్థాల నియమము-2026 అమలు విషయంలో జిల్లా కలెక్టర్లు, లోకల్ బాడీస్, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల బాధ్యతలపై పలు సూచనలు చేశారు.

పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రోజు సేకరిస్తున్న ఘన వ్యర్థ పదార్థాల్లో మనుషులు ముట్టుకోలేనివి, ప్రమాదకరమైన పదార్థాలు సైతం కలిసి ఉంటున్నాయని, వాటిని వేరు చేయడం లేదా నాశనం చేయడంలో  పారిశుధ్య కార్మికులకు అనారోగ్యాలు, కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు సైతం అభవిస్తుంటాయని వీటిని దృష్టిలో ఉంచుకొని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం పాత 2016 నిబంధనల స్తానంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త కఠినమైన నియమాలు అమలులోకి తెచ్చిందని తెలిపారు.

నియమాలను, పర్యవేక్షణ విధానాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నియమాల ప్రకారం ఘన వ్యర్థ పదార్థాలను ఇంటి నుంచి లేదా సంస్థల నుండి  తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శ్యానిటరి వ్యర్థాలు, ప్రత్యేక జాగ్రత్తలు అవసరమైన వ్యర్థాలు (4) రకాలుగా వేరు చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సి ఉంటుంది.

స్వీకరించిన వ్యర్థాలను కొన్నింటిని సేంద్రీయ ఎరువులుగా మరికొన్ని రీసైక్లింగ్, మిగతా వాటిని నాశనం చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన ప్రణాళికలు క్షేత్రస్థాయిలో చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఇంటి నుంచి వ్యర్థాల సేకరణ మరియు వంద శాతం పర్యవేక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు అంచెల శిక్షలు అమలుచేయడం జరుగుతుందని తెలియజేశారు.