12 May, 2026 | 4:13 PM

డీజేలు నిషేధం

12-05-2026 03:13 PM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ నితిక పంత్

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలో డీజే సిస్టమ్‌ల వినియోగం పూర్తిగా నిషేధించబడిందని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్ బాక్సులు, లౌడ్ స్పీకర్లు, భారీ సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. వివాహాలు, ఊరేగింపులు, శుభకార్యాల్లో అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలతో పాటు పరికరాలు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.