calender_icon.png 12 November, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరు బావి నుంచి ఉబికి వస్తున్న నీరు

12-11-2025 10:34:12 PM

కామారెడ్డి జిల్లాలో ఓ రైతు పొలంలో అద్భుతం..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ రైతు పొలంలో ఉన్న బోరుబావి నుంచి ఎలాంటి విద్యుత్ మోటార్ కనెక్షన్ లేకుండానే బోరు నుంచి నీరు ఉబికి వస్తుంది. సంఘటన చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బంజర గ్రామ సమీపంలో రైతు నాయక్ పొలంలో గత కొన్ని మాసాలుగా ఎండిపోయిన ఈ బోరు బావి నుంచి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరగడంతో 150 అడుగుల లోతు నుంచి నీటితో బోర్ నుంచి నీరు పొంగి పొర్లుతుంది. విద్యుత్ మోటార్ లేకుండానే నీరు బోరు నుంచి పైకి రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.