calender_icon.png 10 September, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం వల్లే రిజర్వాయర్లలో నీళ్లు

09-09-2025 12:54:22 AM

భోలక్ పూర్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు

ముషీరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) కాళేశ్వరం వల్లే రిజర్వాయర్లలో నీటిని నింపి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భోలక్ పూర్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముషీరాబాద్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీటితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను  నింపేందుకు  శంఖుస్థాపన చేయడంతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వల్లే అని హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శివ ముదిరాజ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, వంగాల నర్సింగ్‌రావు, పార్టీ నాయకులు జావీద్ ఖాన్, ప్రవీణ్, మనోహర్, కె.ఎం సాయి, ఆజీ పాషా, సైఫొద్దీన్, సుమన్, శివ తదితరులున్నారు.